రోజా పక్కా క్రిస్టియన్.. 3 వేల కోట్లు మింగేసింది - కిరాక్ ఆర్పీ

by velandi.Saikiran |   (  Updated:2025-08-01 10:57:57  IST  )

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత రోజాపై ( Roja ) కిరాక్ ఆర్పీ ( Kirak RP) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మాజీ మం

రోజా పక్కా క్రిస్టియన్.. 3 వేల కోట్లు మింగేసింది - కిరాక్ ఆర్పీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత రోజాపై ( Roja ) కిరాక్ ఆర్పీ ( Kirak RP) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మాజీ మంత్రి రోజా ఓ క్రిస్టియన్ అని... మంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల కోట్లు తినేసిందంటూ బాంబు పేల్చారు కిరాక్ ఆర్పీ. తిరుమల గోశాలలో గోవులు మరణించాయని.. వైసీపీ కొత్త నినాదం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. భూమన, వైసీపీ నేతలు అందరూ గురువారం రోజున... తిరుమలలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, ఆయన భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రోజా. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డబ్బులు రుచి.. చూశారంటూ మండిపడ్డారు రోజా.

అయితే రోజా చేసిన వ్యాఖ్యలకు తాజాగా కిరాక్ ఆర్పీ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాదు... వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys jagan) దగ్గర ఉన్న డబ్బులను రోజానే రుచి చూసిందని చురకలాంటించారు. అన్నదమ్ముల సాక్షిగా మాజీ మంత్రి రోజా... ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలను అడ్డగోలుగా సంపాదించిందని కూడా... సంచలన ఆరోపణలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముసుగులో రోజా ఎప్పుడో క్రిస్టియన్ గా మారిపోయిందని కూడా బాంబు పేల్చారు.

పవన్ కళ్యాణ్ తన కుమారుడు.. అనారోగ్యంగా ఉన్నాడని.. ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. తన కొడుకు క్షేమంగా ఉండాలని... పవన్ కళ్యాణ్ భార్య తిరుమలలో తలనీలాలు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు కిరాక్ ఆర్పీ. పవన్ కళ్యాణ్ సతీమణి... అన్నదానానికి కూడా డబ్బులు ఇచ్చిందని స్పష్టం చేశారు. అలాంటి వారిపై రోజా వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.

Video Link

Next Story