- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పెద్దిరెడ్డికి కాణిపాకం లడ్డు అందజేత
by Vemula.Srinu Prasad |
కాణిపాకం సిద్ధి బుద్ధి సమేత స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో 21 రోజుల పాటు నైవేద్యంగా పెట్టిన లడ్డులను వేలం పాట వేశారు....

X
దిశ, కాణిపాకం: కాణిపాకం సిద్ధి బుద్ధి సమేత స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో 21 రోజుల పాటు నైవేధ్యంగా పెట్టిన లడ్డులను వేలం పాట వేశారు. మొత్తం 21 లడ్డులను ఈ వేలంలో లక్షా ఇరవై ఎనిమిది వేలు చెల్లించి అగరంపల్లికి చెందిన చరణ్ రెడ్డి దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, యువనేత ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డికి ఈ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శైలజ చరణ్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లతో వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథరెడ్డి, సురేష్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






