జనసేన సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శివకుమార్ ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ శివకుమార్ (48) ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి కేనడి నగర్‌లోని తన బంధువు చింతల రమణమూర్తి ఇంటిలోఉరివేసుకుని ప్రాణాలు విడిచారు....

జనసేన సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శివకుమార్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ శివకుమార్ (48) ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి కేనడి నగర్‌లోని తన బంధువు చింతల రమణమూర్తి ఇంటిలోఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందిన శివకుమార్ తిరుపతిలోని తన బంధువుల ఇంటిలో ఉంటున్నారు. అయితే ఈ రోజు ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా వకుమార్ ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి భార్య కళ్యాణి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ ఆకస్మిక మృతితో పార్టీ శ్రేణుల్లో దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

Next Story