వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట: Nagababu

by Vemula.Srinu Prasad |

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ...

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట: Nagababu
X

దిశ, వెబ్ డెస్క్: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సీఎం జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేయొద్దని సూచించారు. తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారన్నారు. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతమని నాగబాబు వ్యాఖ్యానించారు.

Next Story