- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ మహమ్మద్ అరెస్ట్
అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం ముందుకు సాగుతోంది.

దిశ, తిరుపతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం ముందుకు సాగుతోంది. దళం హెడ్ ఎస్పీ సుబ్బారాయుడు మార్గదర్శకత్వంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకొంటోంది. ఒక వైపు ఎర్ర చందనం ఆక్రమ రవాణాని అరికట్టడం కోసం నిరంతరం చర్యలు చేపడుతూనే మరో వైపు జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్ల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. దానితోపాటు పాత కేసులలో పరారీలో ఉన్న స్మగ్లర్లను అరెస్ట్ చేయడం కోసం ప్రత్యేక బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మొహమ్మద్ ముజామిల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. లైసెన్స్ పేరుతో ఎర్రచందనము దుంగలను చైనాకు ఎగుమతి చేస్తున్నాడని, శేషాచల అడవులలో నరికిన ఎర్రచందనము దుంగలను అక్రమ రవాణా చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు కేసులలో ముద్దాయిగా ఉండి, పరారీలో ఉన్నాడన్నారు. ముందస్తు ప్రణాళికతో పరారీలో ఉన్న అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను Cr. No. 60/2025 కేసులో శనివారం తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం, చిత్తూరు – నాయుడుపేట రోడ్డులో తనపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.






