- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన
చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది...

దిశ, బైరెడ్డిపల్లి(తిరుపతి): చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అంగన్వాడీ చిన్నారులను గదిలో బంధించారు. ఈ ఘటన బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తం గ్రామంలో జరిగింది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను అంగన్వాడీ టీచర్, సిబ్బంది బంధించి తాళం వేశారు. గదిలో చిన్నారులు ఏడుస్తుండడంతో స్థానికులు గమనించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంగన్వాడీ కేంద్రం వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అంగన్వాడీ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని చూసుకోవాల్సిన టీచర్ అంగన్ వాడీ కేంద్రాన్ని వదిలి ఎక్కడికి వెళ్లారని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే అంగన్వాడీ టీచర్ సొంత పనుల బిజీలో పిల్లలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేయడంలేదని అంటున్నారు. అంగన్వాడీ కేంద్రంపై పదే పదే ఫిర్యాదులు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు.






