- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ ఇంటివాడైన బెల్లంకొండ శ్రీనివాస్.. తిరుమలలో వైభవంగా వివాహం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల క్షేత్రంలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో ఆయన కావ్య మెడలో మూడుముళ్లు వేశారు..

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Hero Bellamkonda Sai Srinivas) వివాహ(marriage) బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల క్షేత్రంలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో ఆయన కావ్య మెడలో మూడుముళ్లు వేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో వేద మంత్రాల సాక్షిగా, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. శ్రీనివాస్ తన కొత్త జీవితాన్ని వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభించడం విశేషం.
ప్రముఖుల సందడి
ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా, అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






