Sullurpet: అర్ధాంతరంగా నిలిచిపోయిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

by Vemula.Srinu Prasad |

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో ట్రైన్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. ..

Sullurpet: అర్ధాంతరంగా నిలిచిపోయిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రైన్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం 2.20 ప్రాంతంలో రైలులో ప్రయాణించే గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగడంతో హజరత్ నిజాముద్దీన్ నుండి మధురై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో 10 నిమిషాలు అర్ధాంతరంగా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన స్టేషన్ మేనేజర్ సిబ్బందిని అలెర్ట్ చేయడంతో ట్రైన్ 10 నిమిషాల తరువాత తిరిగి బయల్దేరింది. దీనితో ఉత్తరం వైపు ఉన్న గేట్ వద్ద వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు.

Next Story