- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటశ్వేర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటశ్వేర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఈ తరుణంలో తిరుమల కొండకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో టీటీడీ భక్తుల కోసం ప్రతి నెలా ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవ, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేస్తుంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల(మే) 22 వరకు బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మే 17 నుంచి 22వ తేదీ వరకు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
ఆగస్టు 2025కు సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టికెట్ల నమోదుకు ఈ నెల(మే)19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. మే 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను విడుదల చేస్తారు.
మే 22న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శనం స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే 22న ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
మే 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను
మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ మేరకు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.






