శ్రీవారి భక్తులను మోసగిస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్

by Ramesh Naini |

శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని నమ్మించి భక్తుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగి టి.అరుణ్‌కుమార్‌ను తిరుమల టూటౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

శ్రీవారి భక్తులను మోసగిస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని నమ్మించి భక్తుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగి టి.అరుణ్‌కుమార్‌ను తిరుమల టూటౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేసిన ఘటనలో ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు.

2023లోనూ ఇలాంటి మోసాలకే అరెస్టయిన అరుణ్‌కుమార్.. తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతని బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా ఏడాది వ్యవధిలో సుమారు రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఒక మొబైల్, రూ.99 వేల నగదు, మూడు బ్యాంక్ పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story