- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల వెంకన్నను రాజకీయాలకు వాడొద్దు: పయ్యావుల కేశవ్
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సిట్(SIT) రిపోర్టు నేపథ్యంలోలో వైసీపీ(Ycp) నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. నెయ్యి(Ghee) కల్తీ వాస్తవాలు ప్రజల ముందు పెడతామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సిట్ చార్జిషీట్‌లో తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత కూడా పాపపరిహారం అని కార్యక్రమాలు నిర్వహించడం దారుణమన్నారు. ఏ పార్టీ అయినా సరే తిరుమల వెంకన్నను రాజకీయాలకు వాడొద్దన్నారు. సీఎం చంద్రబాబు వెంకన్న స్వామి భక్తుడని, వైసీపీ నేతలు అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ దెబ్బ తీయొద్దని పయ్యావుల తెలిపారు.
2019-24లోనే..
‘‘2019-24లో టీటీడీ నిబంధనలు మార్చారు. సిట్ క్లీన్‌చిట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ప్రచారంచేసుకుంటున్నారు. 2022లో CFTRI రిపోర్ట్‌ను ఎందుకు తొక్కిపెట్టారు. కల్తీ జరిగినట్లు CFTRI రిపోర్ట్‌లో ఉంది. రూ.4 కోట్లకుపైగా చిన్న అప్పన్న అకౌంట్‌లోకి ఎలా వచ్చాయి. కూటమి వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టాం. అప్పుడే కల్తీ వ్యవహారం బయటకొచ్చింది. జంతువుల అవశేషాలున్నాయని NDDB రిపోర్ట్ ఇచ్చింది. NDDB రిపోర్ట్‌లో ఉన్నదే చంద్రబాబు మాట్లాడారు. NDDB రిపోర్ట్‌ను సిట్ చార్జ్‌షీట్‌లో మెన్షన్ చేశారు.’’ అని పయ్యావుల తెలిపారు.






