- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప-చెన్నై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చెన్నై ప్రధాన రహదారిపై లారీ, ప్రయాణికుల బస్సు ఢీకొనడంతో ఒక బాలుడు మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అలాగే శ్రీకాళహస్తికి చెందిన యస్విత అనే విద్యార్థిని కూడా మృతిచెందినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంతో కడప-చెన్నై ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.






