- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు నేస్తం.. తొలకరి జల్లుల్లో ఆరుద్ర సందడి!
by Jakkula.Mamatha |
నిన్నటి వరకు నిప్పుల కుంపటిని తలపించిన ఎండలతో అల్లాడిన ప్రజలు ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న తొలకరి జల్లులతో కాస్త ఉపశమనం పొందారు.

X
దిశ, మంగపేట: నిన్నటి వరకు నిప్పుల కుంపటిని తలపించిన ఎండలతో అల్లాడిన ప్రజలు ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న తొలకరి జల్లులతో కాస్త ఉపశమనం పొందారు. సోమవారం నుండి ‘ఆరుద్ర కార్తె’ ప్రారంభం కావడంతో గ్రామాల్లో అక్కడక్కడ ఆరుద్ర పురుగుల దర్శనమిస్తున్నాయి. జూన్ 22 నుంచి నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని వ్యవసాయ పనుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆరుద్ర కార్తెలో తొలకరి జల్లులు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్నడానికి సిద్ధమవుతుండగా బోర్లు కింద రైతులు విత్తనాలు విత్తడానికి సమాయత్తమవుతున్నారు. ఆరుద్ర కార్తెలో వర్షాలు పడగానే మట్టిలోంచి ముదురు ఎరుపు రంగులో ఉండే ఆరుద్ర పురుగులు బయటకు వస్తాయి. ఇవి పంటలకు ఎలాంటి హాని చేయకుండా ఎండల తీవ్రత తగ్గి, భూమి చల్లబడి రుతుపవనాలు ఊపందుకుంటాయని నమ్ముతారు. వ్యవసాయ ఆధారిత జీవితంలో ఈ కార్తెకు ప్రాముఖ్యత ఉంది.
Next Story






