టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు...భక్తులకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

తిరుమలలో నకిలీ వెబ్ సైట్లు కలకలం సృష్టించాయి.. దర్శన టికెట్లు, గదుల కేటాయింపుల పేరుతో భక్తుల నుంచి నిర్వాహకులు డబ్బులు దోచుకుంటున్నారు

టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు...భక్తులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో నకిలీ వెబ్ సైట్లు(Fake websites) కలకలం సృష్టించాయి. దర్శన టికెట్లు, గదుల కేటాయింపుల పేరుతో భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో టీటీడీ(TTD) అప్రమత్తమైంది. టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లను గుర్తించింది. గతంలోనూ 40 నకిలీ వెబ్ సైట్లపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా సరే మళ్లీ నకిలీ వెబ్‌సైట్లు చెలరేగిపోయాయి. దీంతో ఈ నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే భక్తులు సేవా టికెట్లు పొందాలని స్పష్టం చేశారు. భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Next Story