- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరికి సీఎం చంద్రబాబు.. పర్యటనకు సర్వంసిద్ధం
సీఎం చంద్రబాబు నాయుడు నగరి పర్యటనకు సర్వం సిద్ధమైంది...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తిరుపతి జిల్లా నగరి(Nagari) పర్యటనకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం అమరావతి(Amaravati) నుంచి నగిరికి ఆయన బయల్దేరనున్నారు. ఈ మేరకు ఉదయం 11.20 గంటలకు నగరి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత ఉ.11.30 గం.లకు శాప్ స్పోర్ట్స్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మ.1.50 గంటలకు నగరి బాలురు, బాలికల ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను పరిశీలిస్తారన్నారు. మ.2.15 గం.లకు నగరి ఏరియా ఆసుపత్రి చేరుకుని ప్రజలతో సంభాషించనున్నారు. అనంతరం మ.2.40 గం.లకు జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశంలో పాల్గొంటారు. మ.3.55 గం.లకు హెలిప్యాడ్ నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణంకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను స్థానిక కలెక్టర్ పరిశీలించారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.






