తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం...భక్తులకు గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-16 11:56:54  IST  )

తిరుమల ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భక్తులకు గాయాలు అయ్యాయి...

తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం...భక్తులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మూల మలుపును డ్రైవర్ గమనించకపోవడంతో కారు అదుపు తప్పింది. కంట్రోల్ కాక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story