- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం ఏకంగా 18 గంటల సమయం పడుతున్నట్లు అధికారుల సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం ఏకంగా 18 గంటల సమయం పడుతున్నట్లు అధికారుల సమాచారం. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లు దాటి భక్తులు కృష్ణ తేజ సర్కిల్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం నుంచి భక్తులు ఓపికతో క్యూలైన్లలో కొనసాగుతున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.
నిన్నటి గణాంకాలు ఇవే..
శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయానికి సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 67,264 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపింది. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. మొక్కులు చెల్లించుకోవడానికి 29,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొంది. భక్తుల రద్దీ దృష్ట్యా, సర్వదర్శనం కోసం వచ్చే వారు వేచి ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






