- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 5 వేల కోట్లతో గూడూరు అభివృద్ధి: కలెక్టర్ వెంకటేశ్వర్
గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలంలో జరుగుతున్న సాగరమాల ప్రాజెక్టు రహదారి పనులను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ...

దిశ. గూడూరు: గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలంలో జరుగుతున్న సాగరమాల ప్రాజెక్టు రహదారి పనులను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలో నాలుగు వరుసల రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరంపారిచర్లవారిపాలెంలో ఏర్పాటై ఉన్న మేఘ కంపెనీ కార్యాలయంలో మేఘ కంపెనీ ప్రతినిధులతో స్థానిక అధికారులతో కలిసి సమీక్షనిర్వహించారు. రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో క్రిస్ సిటీ, సాగర మాల రహదారి నిర్మాణ అభివృద్ధి పనులు 5 వేల కోట్ల మేర పనులు శరవేగంగా జరుగుతున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చెన్నై కోల్ కతా జాతీయ రహదారి నుండి కృష్ణపట్నం పోర్టు వరకు నాయుడుపేట, చిల్లకూరు తదితర నాలుగు ప్రాంతాల్లో 3 వేల కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న సాగరమాల రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తమ్మినపట్నం ప్రాంతంలో 2500 ఎకరాల్లో క్రిస్ సిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో అక్కడ భూములను పరిశీలిస్తున్నామని చెప్పారు.. నాయుడుపేట, శ్రీ సిటీ తరహాలో పోర్టుకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు కావడానికి అనువైన ప్రదేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు.






