బాబు మీ ఖాతాలో రూపాయి అయినా వేశారా?: సీఎం జగన్

by Disha Web Desk 18 |
బాబు మీ ఖాతాలో రూపాయి అయినా వేశారా?: సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్:టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎప్పుడైనా మీ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా ఒక్క రూపాయి అయినా జమ చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.చిత్తూరులో జరుగుతున్న జగన్ బస్సు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాలో ఎన్ని లక్షల రూపాయలు వేసిందో గమనించండి అన్నారు.ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే రూ.14 వందల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వేశామని సీఎం జగన్ తెలిపారు.బడులు,సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు చూస్తే గుర్తొచ్చేది మీ జగన్ అని అన్నారు.చంద్రబాబు ని చూస్తే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా అని ప్రశ్నల వర్షం కురిపించారు.బటన్ నొక్కి నేరుగా డబ్బులు వేశాం.విశ్వసనీయత ఒకవైపు మోసం ఒక వైపు ఉన్నాయి.ఏది కావాలో మీరే తేల్చుకోండి అని సీఎం పేర్కొన్నారు.

Next Story

Most Viewed