Breaking: తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-09 08:47:56  IST  )

తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు..

Breaking: తిరుపతి ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టు(Tirupati Renigunta Airport)లో హై అలర్ట్(High Allert) ప్రకటించారు. అంతేకాదు ఎయిర్ పోర్టు పరిసరాల్లో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులోనూ తనిఖీలు నిర్వహించారు. డాగ్, బాంబ్ స్వ్కాడ్ సిబ్బందితో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యాగులు, లగేజీల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టు అధికారులతో ఎస్పీ హర్షవర్దన్ సమావేశం నిర్వహించారు. భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం టెర్రిర్ దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసింది. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం కావడంతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. మృతుల్లో లష్కరే తోయిబా, జైషే ఉగ్రవాదులు సైతం ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు సైతం ఉన్నారు. అయితే పాకిస్థాన్ సైన్యం వక్రబుద్ధి చూపించింది. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ పౌరులే లక్ష్యంగా డోన్స్, మిసైల్స్‌తో చేస్తోంది. దీంతో భారత్ జవాన్లు సైతం దీటుగానే సమాధానం చెబుతున్నారు. భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన 50కి పైగా డ్రోన్లను కూల్చివేశారు. ఈ పరిస్థితులు మరింత ఉధృతం అవుతున్నందున తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో కూడా హై అలర్ట్ ప్రకటించారు.

Next Story