- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు
ఏపీలో రెండు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. కోర్టుల ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులో ఉన్నవారిని, సిబ్బందిని ఖాళీచేయించి బయటకు పంపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు కాంప్లెక్స్ లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఆ మెయిల్ ఎవరు పంపారు? దీనివెనుక ఆగంతకుల ఉద్దేశ్యమేంటన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు అనంతపురం కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో ఆత్మాహుతి దాడి జరుగుతుందని అగంతకుడు కాల్ చేశాడు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమయ్యారు. దీంతో కోర్టు కాంప్లెక్స్ లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ఇతరులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏలూరు కోర్టులో కూడా బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.






