TTD:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

TTD:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ సంవత్సరం తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 4వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ(TTD) అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉంటాయని టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Shyamala Rao) తెలిపారు. ఈ తరుణంలో భక్తుల(Devotees) రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు ప్రకటించారు.

ఈ క్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులతో కలిసి తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో శ్యామలరావు పరిశిలించారు. అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ఏటా శుక్లపక్షం సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ రథ సప్తమి వేడుకలు ఉదయం 5: 30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తాయని చెప్పారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. గతంలో కంటే ఈ ఏడాది అదనపు బందోబస్త్‌తో కట్లుదిట్టమైన ఏర్పట్లు చేస్తున్నామన్నారు. వాహన సేవలు చూడడానికి గ్యాలరీల్లోకి భక్తులకు అనుమతిస్తామన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

Next Story