Tirumala:టీటీడీ మరో సంచలన నిర్ణయం.. ఇక ఆ పేర్లు మాయం!

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

Tirumala:టీటీడీ మరో సంచలన నిర్ణయం.. ఇక ఆ పేర్లు మాయం!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల(Tirumala)లో దాతల సహకారంతో నిర్మించిన అతిథి గృహాల విషయంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు(TTD Trust Board) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వ్యాప్తంగా దాతల సహకారంతో గతంలో 45 అతిథి గృహాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఆ సయంలో వాటికి ఆయా సంస్థలు, వ్యక్తుల పేర్లు పెట్టారు.

అయితే అతిథి గృహాలకు ఆ పేర్లను మార్పు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇక వాటి స్థానంలో ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల విరాళంతో నిర్మించిన లక్ష్మీ వీపీఆర్ అతిథి గృహం పేరును లక్ష్మీ భవన్‌గా మార్పు చేశారు. అతిథి గృహాలకు పేర్ల మార్పు విషయంలో పలువురు దాతలు ఇప్పటికే అంగీకారం తెలిపారు.

Next Story