- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చలో విజయవాడ’కు AITUC పిలుపు
మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీన చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్. నాగరాజు, వి.సి. గోపినాథ్ పిలుపునిచ్చారు....

దిశ, చిత్తూరు ప్రతినిధి: మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీన చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్. నాగరాజు, వి.సి. గోపినాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రంగంలోని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగం, స్కూల్ స్వీపర్లు, పార్కు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని వారు ఆరోపించారు. ఇందులో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత నెల 20 నుంచి దశలవారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతోనే ఈ 'చలో విజయవాడ' ధర్నాకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు.
విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కాంక్షిస్తూ ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ నాయకులు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి.సి. గోపినాథ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగానే ఇక్కడ కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, స్కూల్ స్వీపర్లు, పార్కు సిబ్బందికి నెలకు రూ. 34వేలు కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని వర్తింపజేయాలని, రిటైర్డ్ బెనిఫిట్ కింద రూ. 5 లక్షల గ్రాడ్యుయిటీ చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, పెరిగిన జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా అదనపు కార్మికులను నియమించి, పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించాలని, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెనుకాడబోరని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






