అంతా ఆ తిరుపతి వెంకన్న దయ.. ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు

by Bhoopathi Nagaiah |

తిరుమల శ్రీవారిని దర్శించుకోని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై ఆరుగురి ప్రాణాలు మృత్యువు చివరి అంచుల వరకు వెళ్లివచ్చారు.

అంతా ఆ తిరుపతి వెంకన్న దయ.. ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు
X

దిశ, తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై ఆరుగురి ప్రాణాలు మృత్యువు చివరి అంచుల వరకు వెళ్లివచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన ఆరుగురు భక్తులు బుధవారం శ్రీవారి దర్శనం అనంతరం కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని చివరి మలుపు దాటిన తరువాత కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను దాటి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురి భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న విజిలెన్స్, రోడ్డు భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారును ఘాట్ రోడ్డు నుంచి తొలగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చూశారు. కాగా, ఘాట్ రోడ్డుపై భారీ ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణిలకు వివరాలు, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story