Tirumala: కల్తీ నెయ్యి కేసు.. కీలక పరిణామం

by Vemula.Srinu Prasad |

కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

Tirumala: కల్తీ నెయ్యి కేసు.. కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధికారి సుబ్రహ్మణ్యం(Former officer Subramaniam) బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఒత్తిడి చేయడం వల్లే నెయ్యిని కల్తీ చేశారని సుబ్రహ్మణ్యంపై ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుబ్రహ్మణ్యం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో సుబ్రహ్మణ్యం టీటీడీ కొనుగోళ్ల విభాగంలో పని చేశారు. ఆ సమయంలో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు దర్యాప్తు చేయాలని సిట్‌కు అప్పగించింది. కేసు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు.. టీటీడీలో పని చేసిన ఉద్యోగులు కల్తీ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు మాజీ అధికారి సుబ్రహ్మణ్యంను కూడా అరెస్ట్ చేసి విచారించింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు.

Next Story