‘శభాష్ అవ్వ’ తిరుమలకు మెట్లెక్కి వెళ్లిన 116 ఏళ్ల బామ్మ: సీఎం చంద్రబాబు ప్రశంసలు

by Ramesh Naini |

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న అచంచల భక్తితో కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల కొండను కాలినడకన ఎక్కిన విషయం తెలిసిందే.

‘శభాష్ అవ్వ’ తిరుమలకు మెట్లెక్కి వెళ్లిన 116 ఏళ్ల బామ్మ: సీఎం చంద్రబాబు ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న అచంచల భక్తితో కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల కొండను కాలినడకన ఎక్కిన విషయం తెలిసిందే. యువకులు సైతం అలసిపోయే మెట్ల మార్గంలో ఆమె ఏమాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘శభాష్ అవ్వ’ అంటూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆ బామ్మ వీడియోను షేర్ చేస్తూ.. ‘వయసు కేవలం అంకె మాత్రమేనని ఆమె నిరూపించారు’ అని కొనియాడారు. స్వామివారిపై ఆమెకున్న అపారమైన భక్తి, ఆమెకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అభినందనీయమని, ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘ఈ వయసులో ఆమె చూపిన సంకల్ప బలం అందరికీ ఆదర్శం’ అని కొందరు కామెంట్ చేయగా.. అంతటి వృద్ధురాలి భక్తిని గౌరవిస్తూ, ఆమెకు తిరుమలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ‘బ్రేక్ దర్శనం’ కల్పించేలా చూడాలని మరి కొందరు నెటిజన్లు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story