- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు.. న్యాయస్థానం సంచలన తీర్పు
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. కేసులో పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత A1 నుంచి A5గా ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువైందన్న కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా దోషులకు ఈనెల 27 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అదేవిధంగా A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్లు ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
కాగా, 2015 నవంబర్ 15న చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అనురాధ, భర్త మోహన్‌లను దుండగులు తుపాకీలతో కాల్చి, కత్తులతో నరికి చంపారు. ఈ హత్యకు సంబంధించి మొత్తం 23 మంది నిందితులను చార్జీషీటులో చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసులో నిందితుడిగా ఉన్న కాళహస్తికి చెందిన కాసారం రమేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో అతడిని కేసు నుంచి తొలగించారు. మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో నిందితులుగా 21 మంది మిగిలారు. చింటూ ప్రధాన నిందితుడిగా వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగన్, యోగానంద్, పరందామ, హరిదాస్, మొగిలి, శశిధర్, యోగానందం, ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, ఆనంద కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, సురేష్ పేరిట పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు 163 మంది వరకు సాక్షులుగా ఉన్నారు. కేసు మొత్తాన్ని విచారించిన చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం పరిధిలోని మహిళా ప్రత్యేక కోర్టు ఇంచార్జ్ న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు తీర్పును వెలువరించారు.






