చిత్తూరు : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. విద్యార్థులకు గాయాలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 06:00:04  IST  )

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స.

చిత్తూరు : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. విద్యార్థులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తాజాగా చిత్తూరు (Chittoor) జిల్లాలో ఓ ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు (School Students) గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం (SR Puram) మండలంలోని క్షీరసముద్రం బీసీ కాలనీ (BC Colony) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఓ పాఠశాల బస్సు జీడీ నెల్లూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో క్షీరసముద్రం బీసీకాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి బస్సు దెబ్బతింది. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక విద్యార్థికి నాలుక తెగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలను చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకు దింపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా చిత్తూరు, పుత్తూరు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story