- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారి దోపిడీ ముఠా అరెస్ట్.. రూ.3.5 కోట్ల విలువైన గోల్డ్ సీజ్
రాత్రి సమయంలో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను చిత్తూరు జిల్లా వి. కోట పోలీసులు అరెస్ట్ చేశారు.....

దిశ, వెబ్ డెస్క్: రాత్రి సమయంలో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను చిత్తూరు జిల్లా వి. కోట పోలీసులు అరెస్ట్ చేశారు. వి.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 9 మంది ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై వచ్చే వాహనాలు, ఆపి డ్రైవర్లను బెదిరించి డబ్బులు, ఫోన్లు, వారి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుంటున్నారు. ఎవరైనా అడ్డం తిరిగితే దాడులకు దిగుతున్నారు. ఇలా ఈ ముఠా బాధితులు భారీగా పెరిగారు. దీంతో పిటిష్ట నిఘా పెట్టిన పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కీలక సూత్రధారి జైపాల్‌గా గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.






