వరగానిలో విషాదం.. స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా వరగానిలో తీరని విషాదం నెలకొంది. పాఠశాలకు వెళ్లే క్రమంలో ఒక చిన్నారి స్కూలు బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ...

వరగానిలో విషాదం.. స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) వరగాని(Varagani)లో తీరని విషాదం(Tragedy) నెలకొంది. పాఠశాలకు వెళ్లే క్రమంలో ఒక చిన్నారి స్కూలు బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోజూలాగే ఉత్సాహంగా బడికి వెళ్లేందుకు సిద్ధమైన ఆ పసికందు, విధి వంచనతో విగతజీవిగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కళ్లముందే చిన్నారి ప్రాణాలు పోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు బస్సును అడ్డుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల పూర్తి వివరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిబిడ్డ మరణంతో ఆ కుటుంబంలో అలుముకున్న విషాద ఛాయలు ఊరందరినీ కన్నీరు మున్నీరు చేస్తున్నాయి.

Next Story