పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా చిలకలూరిపేట: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులను ఏర్పాటు చేసి, "ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను" తయారు చేయాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఈ పార్క్ నిదర్శనమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ..

పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా చిలకలూరిపేట: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులను ఏర్పాటు చేసి, "ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను" తయారు చేయాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఈ పార్క్ నిదర్శనమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ పార్క్ ద్వారా పల్నాడు ప్రాంతంలోని యువ పారిశ్రామికవేత్తలకు సరికొత్త అవకాశాలు, సాంకేతిక ఆవిష్కరణలకు అద్భుతమైన ప్రోత్సాహం లభిస్తాయని ఆయన తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఇప్పటికే పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ఎంపీ పేర్కొన్నారు. ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాటన్, జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, కాటన్ ఆయిల్స్ మిల్స్ యూనిట్ల ద్వారా దాదాపు 30 నుంచి 35 వేల మందికి ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు.

క్లస్టర్ల ద్వారా మహిళా సాధికారత

పారిశ్రామికీకరణతో పాటు మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు గౌరవ ఎంపీ తెలిపారు. DRDA డిపార్ట్‌మెంట్ ద్వారా క్లస్టర్లను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎడ్లపాడు మండలంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్, నాదెండ్ల మండలంలో డైరీ యూనిట్, చిలకలూరిపేటలో కరివేపాకు, కార్పెంటరీ యూనిట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఒక్క చిలకలూరిపేటలోనే కాకుండా, యావత్ పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో 28 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.

Next Story