- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గత నెలలో పాలనాపరమైన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ముక్కుకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సర్జరీ అనంతరం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అలాగే దీర్ఘకాలం పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు గత 10 రోజులుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పవన్ నివాసానికి వెళ్లి తాజా ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సమయంలోనూ చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం విదితమే.
నాయుడు కుటుంబ సభ్యులకు పరామర్శ
అదేవిధంగా.. నంది హిల్స్‌లో ఇటీవల మరణించిన రీజెన్సీ అధినేత జి.ఎన్. నాయుడు కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






