- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి
రికార్డు టైం లో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

దిశ డైనమిక్ బ్యూరో : రికార్డు టైం లో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈరోజు సచివా లయంలో సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ. 81,317 కోట్ల మేర పనుల్ని సిఆర్డిఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు అధికారులు వివరించారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మా ణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు,డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూరికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.






