ఏపీ రైల్వే రంగానికి కేంద్రం వరం: సీఎం చంద్రబాబు హర్షం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు....

ఏపీ రైల్వే రంగానికి కేంద్రం వరం: సీఎం చంద్రబాబు హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలపడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించనున్న 4.3 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జి ఈ ప్రాంత రవాణా వ్యవస్థలోనే ఒక మైలురాయిగా నిలవనుందని, దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త రైల్వే లైన్ల వల్ల కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, పారిశ్రామిక రంగానికి, పోర్టు ఆధారిత అభివృద్ధికి భారీ ఊతం లభిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాలైన అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం సందర్శించే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సరుకు రవాణా వేగం పుంజుకోవడంతో పాటు, ఈ ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర' సాకారానికి, 'వికసిత భారత్' లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story