- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానాడులో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తేదీని ప్రకటించిన సీఎం చంద్రబాబు
వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని తెలిపారు. ఇప్పుడు ప్రజల్లో అశాంతి తగ్గిందన్నారు. కూటమి పాలనతో చీకటి తొలగిపోయిందని అన్నారు. అన్న క్యాంటీన్ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం.. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్సిలిండర్లు ఇస్తున్నాం.. డీఎస్సీ నోటిఫికేషన్ఇచ్చాం.. మళ్లీ స్కూళ్లు తెరిచే లోపల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్సిక్స్హామీలను నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అయినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నగదును పాఠశాలలు ప్రారంభించే ముందుగానే ఇస్తామని తెలిపారు. అన్నదాతకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్హబ్గా తయారు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు సూపర్సిక్స్పూర్తిచేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతామని తెలిపారు. కొండను కూడా ఢీకొట్టే శక్తిని కార్యకర్తలు తనకు ఇస్తున్నారని అన్నారు. మనది పొలిటికల్గవర్నెన్స్అన్నారు. కార్యకర్తల ద్వారానే పరిపాలన జరగాలని సూచించారు. ఈ మహానాడు ద్వారా పునరకింతం అవుతామని ప్రకటించారు.






