లిక్కర్ కేసులో రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి

by Ajay Maddhiboyina |

లిక్క‌ర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని కోర్టు మూడు రోజుల సిట్ విచార‌ణ‌కు అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే.

లిక్కర్ కేసులో రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: లిక్క‌ర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని కోర్టు మూడు రోజుల సిట్ విచార‌ణ‌కు అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. నిన్న ఆయ‌న మొద‌టిరోజు సిట్ విచార‌ణ‌కు హాజ‌రుకాగా నేడు రెండో రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అయితే విజ‌య‌వాడ జైలు నుండి సిట్ కార్యాల‌యానికి త‌ర‌లిస్తుండగా చెవిరెడ్డి మ‌రోసారి హ‌ల్ చ‌ల్ చేశారు. విజ‌య‌వాడ జైలు వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. సిట్ త‌ప్పులు చేస్తోంద‌ని ఆరోపించారు. అంతే కాకుండా ఏదో ఒక‌రోజు మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రించారు. ఇక అదుపులోకి తీసుకున్న త‌ర‌వాత చెవిరెడ్డి ఎప్పుడు మీడియాకు క‌నిపించినా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. నిన్న విచార‌ణ‌కు త‌ర‌లించే క్ర‌మంలోనూ ఆయ‌న ప్ర‌భుత్వంపై , అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేదని దేవుడు చూస్తున్నాడ‌ని అన్నారు. త‌ప్పుడు కేసులతో త‌న‌ను అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. అక్ర‌మంగా అరెస్ట్ చేయించిన‌వారు నాశనం అయిపోతారంటూ శాప‌నార్థాలు పెట్టారు. కాల‌మే అన్నింటికి స‌మాధానం చెబుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Next Story