అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-29 06:18:48  IST  )

అక్ర‌మ మ‌ద్యం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌తో పాటు స‌జ్జ‌ల శ్రీధ‌ర్ రెడ్డి, వెంక‌టేష్ నాయుడుల‌కు సైతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: అక్ర‌మ మ‌ద్యం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌తో పాటు స‌జ్జ‌ల శ్రీధ‌ర్ రెడ్డి, వెంక‌టేష్ నాయుడుల‌కు సైతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ‌త ప్ర‌భుత్వంలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేపథ్యంలో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ కుంభ‌కోణంలో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుండి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి భారీగా డ‌బ్బులు అందుకున్నార‌ని, ఆ డ‌బ్బును గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ కోసం ఉప‌యోగించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సిట్ విచార‌ణ‌కు ఆదేశించ‌గా చెవిరెడ్డి పాత్ర ఉంద‌ని నోటీసులు జారీ చేసి జూన్ 17వ తేదీన బెంగుళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఏ 38గా ఆయ‌న కుమారుడు మోహిత్ రెడ్డి ఏ 39గా ఉన్నారు. చెవిరెడ్డిని జూన్ లో అరెస్ట్ చేయ‌గా మ‌ధ్యంత‌ర బెయిల్ కోసం ఎంతో ప్ర‌య‌త్నించారు. ఎట్ట‌కేల‌కు 226 రోజుల త‌ర‌వాత బెయిల్ వ‌చ్చింది. ఇక ఇదే కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవింద‌ప్ప‌, కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, ధ‌నుంజ‌య్ రెడ్డికి రెగ్యుల‌ర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. కానీ అరెస్ట్ నుండి కొంత‌కాలం మిన‌హాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్ర‌య‌ల్ కోర్టును ఆశ్రయించాల‌ని సూచించింది.

Next Story