Tirumala Stampede : తిరుమల తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

by Y. Venkata Narasimha Reddy |

వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట(Tirumala Stampede)లో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు టీటీడీ, బోర్డు సభ్యులు ప్రకటించిన నష్టపరిహారం చెక్కులను హోం మంత్రి అనిత(Home Minister Anitha), టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్(Palla Srinivas), ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు(MLA Vishnu Kumar Raju), ఎమ్మెల్సీ చిరంజీవి రావు(MLC Chiranjeevi Rao), టీటీడీ(TTD) బోర్డు సభ్యులు పంపిణీ చేశారు.

Tirumala Stampede : తిరుమల తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట(Tirumala Stampede)లో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు టీటీడీ, బోర్డు సభ్యులు ప్రకటించిన నష్టపరిహారం చెక్కులను హోం మంత్రి అనిత(Home Minister Anitha), టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్(Palla Srinivas), ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు(MLA Vishnu Kumar Raju), ఎమ్మెల్సీ చిరంజీవి రావు(MLC Chiranjeevi Rao), టీటీడీ(TTD) బోర్డు సభ్యులు పంపిణీ చేశారు.

భావోద్వేగంతో కూడిన వాతావరణంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్కక్రమంలో చనిపోయిన తమవారిని తలుచుకుని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు పెట్టుకోగా..వారిని హోంమంత్రి అనితా ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరఫున రూ. 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

కుటుంబంలో ఒక వ్యక్తికి టీటీడీలో, కాంట్రాక్టు ఉద్యోగం.. చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం. అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలు తమ సమస్యలను ప్రస్తావించగా..సీఎంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

Next Story