- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:భక్తులపై చిరుతల దాడులు.. టీటీడీ కీలక నిర్ణయం?
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో నడకదారి మార్గంలో భక్తులు తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వస్తారు. అయితే తిరుమలలో చిరుత(cheetah)ల సంచారం భక్తులను భయాందోళనల(Panic)కు గురిచేస్తోంది. చిరుతలు భక్తుల పై దాడులు చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.
గత నెలలో అలిపిరి-తిరుమల(Alipiri-Tirumala) నడక మార్గంలోని 7వ మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమై.. చిరుతను పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అధికారులు భక్తులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. నడక మార్గాన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని, ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది భక్తులు ఉండాలని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల పై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్(Forest)లోని చిరుతలు, ఎలుగుబంట్లు(Bears), ఏనుగుల(elephants)కు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్(Animal radio collar system)ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. ఈ తరుణంలో చిరుతలను ట్రాప్ చేసి పట్టుకుని సిమ్‌తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్‌ను అమర్చుతారు.






