- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో ప్రహరీగోడపై చిరుత పరుగులు..వీడియో వైరల్
తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు మరోసారి చిరుతపులి కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరిగెత్తడాన్ని కారులో వెళుతున్న భక్తులు వీడియో తీశారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు మరోసారి చిరుతపులి కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరిగెత్తడాన్ని కారులో వెళుతున్న భక్తులు వీడియో తీశారు. రెండు కార్లు రోడ్డుపై వెళుతుండగా చిరుత ప్రహరీ గోడపై పరిగెత్తుతూ ఒకచోట పక్కకు దూకేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అయితే తిరుమల ఘాట్ రోడ్డులో అడవి జంతువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అనేకసార్లు జంతువులు ఈ దారి గుండా వెలుతూ భక్తులకు కనిపించాయి. అంతేకాకుండా దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మార్గంలో వెళ్లేటప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతుంటారు.
Next Story






