- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. మండలిలో గందరగోళం
ద్రవ్య వినిమయ బిల్లును ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యేలందరూ అమోదించారు...

దిశ, వెబ్ డెస్క్: ద్రవ్య వినిమయ బిల్లు(Currency Exchange Bill)ను ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యేలందరూ అమోదించారు. అటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సైతం తీర్మానాన్ని బలపర్చారు. అయితే ఈ బిల్లును శాసనమండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) ప్రవేశపెట్టారు. అయితే కాగ్ రిపోర్టుపై పయ్యావులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
కాగ్ రిపోర్టుపై మండలిలో మంటలు
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శాసనమండలి సమావేశాలు మాత్రం కొనసాగుతున్నాయి. కాగ్ రిపోర్టుపై బొత్స, పయ్యావుల మధ్య వాగ్వాదం జరిగింది. కాగ్ రిపోర్టుపై బొత్స అబద్దాలు చెబుతున్నారని పయ్యావుల ఆరోపించగా తమకు ఆ అవసరం లేదని బొత్స సమాధానం ఇచ్చారు. కాగ్ రిపోర్టులో అభ్యంతరాలు చెబితే తాము పరిశీలిస్తామని పయ్యావుల చెప్పారు. కానీ కాగితాలు ఎప్పుడో పంపుతామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వాలని పయ్యావుల సూచించారు. ఇందుకు బొత్స సత్యనారాయణ సమాధానం చెబుతూ కాగ్ రిపోర్టు కాగితాలు పంపేందుకు ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. తన మాటల్లో తప్పులుంటే వెనక్కి తీసుకుంటానని బొత్స వ్యాఖ్యానించారు.






