- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ శానన మండలిలో గందరగోళం.. సభను వాయిదా వేసిన చైర్మన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) సమావేశాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) సమావేశాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే చైర్మన్ మోషేన్ రాజు (Chairman Moshen Raju) ప్రశ్నోత్తరాలను ఆరంభించారు. అయితే, అంతకు మందుకు వైసీపీ (YCP) నేతలు రాష్ట్రంలో రైతు సమస్యలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, యూరియా కొరతపై సభలో చర్చించాలని చైర్మన్‌కు మోషేన్ రాజు వాయిదా తీర్మానం అందజేశారు. అనంతరం వారి అభ్యర్థనను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
మరోవైపు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ.. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మాట్లాడుతూ.. రైతు సమస్యలపై చర్చించేందకు తాము ఎప్పడైనా సిద్ధమేనని ప్రకటించారు. వైసీపీ హయాంలోనే రైతులకు తీరని అన్యాయం జరిగిందని ప్రతిగా టీడీపీ (TDP) సభ్యులు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో చైర్మన్ మోషేన్ రాజు కలుగుజేసుకుని రైతు సమస్యలపై చర్చ కోసం బీఏసీ (BAC)లో సమయం కోరాలని వైసీపీ నేతలు సూచించారు. అయినా, శాసన మండలిలో వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ వైసీసీ నేతలు చైర్మన్ పోడియంను ముట్టడించడంతో ఆయన సభను వాయిదా వేశారు.






