Kurnool: కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-26 14:13:03  IST  )

కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది..

Kurnool: కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం(Kurnool Corporation General Assembly Meeting) రసాభాసగా మారింది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) మధ్య మాటల యుద్ధం నడించింది. ప్రభుత్వ హామీలపై వైసీపీ సభ్యులు నిలదీశారు. తాగునీటి విషయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ బి.వై.రామయ్య, టీటీపీ సభ్యుడు పరమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలు చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్ పెద్దగా అరుస్తూ కుర్చీలు నెలకేసికొట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేవం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వైసీపీ కార్పొరేటర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు.

Next Story