- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా : చంద్రబాబు
by Muthe.Rajitha |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పావర్టీకి దిగువన ఉన్న కొన్ని కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జీరో పావర్టీ P4 పథకం(P4 scheme)పై నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్న నిర్ణయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా పేదరిక నిర్మూలనలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో భాగం కావాలని, కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Next Story






