ఎన్టీఆర్‌ మెడికల్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్‌.. ఆమోదం తెలిపిన గవర్నర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-24 04:05:54  IST  )

రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఎన్టీఆర్‌ మెడికల్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్‌.. ఆమోదం తెలిపిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ మెడికల్ యూనివర్సిటీ (NDR Medical University) వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ పి.చంద్రశేఖర్ (Dr.P.Chandrashekar) నియమితులయ్యారు. అయితే, యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సటీకి వీసీగా డాక్టర్ పి.‌చంద్రశేఖర్‌ పేరును గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో వీసీగా చంద్రశేఖర్ నియామకం ఖరారైంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ శ్యామ ప్రసాద్ పిగిలం (Dr. Shyama Prasad Pigilam) కొనసాగారు. ఇక కొత్త వీసీగా ఎంపికైన చంద్రశేఖర్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) శుభాకాంక్షలు తెలిపారు.

Next Story