- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila : చంద్రబాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ : వైఎస్.షర్మిల
గౌతమ్ అదానీ(Gautam Adani)పై చర్యలకు ఖచ్చితమైన సమాచారం ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటానన్న ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వై.ఎస్.షర్మిల(YS Sharmila)మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: గౌతమ్ అదానీ(Gautam Adani)పై చర్యలకు ఖచ్చితమైన సమాచారం ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటానన్న ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వై.ఎస్.షర్మిల(YS Sharmila)మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారని..? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని..? చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఆనాడు ఎందుకు చెప్పారని..? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారని..? షర్మిల నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యాడని. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఔ(FBI) స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని..అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని షర్మిల గుర్తు చేశారు.
ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, ఖచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని షర్మిల విమర్శించారు. అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని.. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీ(ACB)ని సైతం రంగంలోకి దించకుండా అదానీని కాపాడుతున్నారని ఆరోపించారు. అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజమని.. మోడీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారన్నది వాస్తవం అని షర్మిల పేర్కొన్నారు.
అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని..అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించి నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు.






