CM Chandrababu : చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: ఆనం వెంకటరమణా రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి(Anam Venkataramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu : చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: ఆనం వెంకటరమణా రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి(Anam Venkataramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత విజయ సాయి రెడ్డి(Vijayasai Reddy) తాజాగా చంద్రబాబుపై చేసిన విమర్శలపై ఆనం ఫైర్ అయ్యారు. కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29 వేల చొప్పున్న లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. ఏ వాల్యూయేషన్ ప్రకారం 2200 ఎకరాలు రూ.12కోట్లకి ఇచ్చారని నిలదీశారు. ఏపీలో ఎక్కడైనా ఎకరా రూ.29వేలకు దొరుకుతుందా అని అడిగారు. మా నాయకుడిని తిడితే ఏమొస్తుంది, బొక్కలో వేస్తాం. నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వూ బొక్కలోకి పోతావని గుర్తుపెట్టుకో అని విజయసాయి రెడ్డికి ఆనం మాస్‌ వార్నింగ్ ఇచ్చాడు. సీఎం చంద్రబాబుని 70ఏళ్ల ముసలోడంటూ, మళ్లీ అధికారంలోకి వచ్చాక జెళ్లో వేయిస్తానంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాస్ట్ బడీస్ అన్నావ్ కదా.. ఒరేయ్ పొట్టిసాయి రెడ్డి, సారారెడ్డి.. నువ్వేమైన రెడ్లకి న్యాయం చేశావా అని ప్రశ్నించాడు. అయిదేళ్లలో విజయసాయి రెడ్డి రెడ్లని సంక నాకిచ్చాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర సీఎంని పట్టుకుని మెంటలోడు, ముసలోడు అంటావా.. ఆరవైఏడేళ్లు ఉన్న నువ్వు ఏమైనా కుర్రాడివా అని విజయసాయి రెడ్డిపై ఆనం విమర్శలు గుప్పించారు. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొనే వాడు కుర్రోడా అని ఎద్దేవా చేశారు. నువ్వు చిప్ చిప్ బ్యాచీ కాదా? జగన్ బెడ్ రూంలో నుంచి బయటకి రాగానే చెమ్మచెక్క కొట్టేది నువ్వని విమర్శించారు.

Next Story