పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై చంద్రబాబు ప్రశంసలు.. CM జగన్‌కు మాస్ వార్నింగ్

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై చంద్రబాబు ప్రశంసలు.. CM జగన్‌కు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెనమలూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సినిమాల్లో పవన్ కల్యాణ్ గొప్ప నటుడు అన్నారు. అక్కడే కొనసాగితే ఆయన లైఫ్ ఎంతో విలాసవంతంగా ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలో ఆయన రేంజ్ ఏంటో కూడా అందరికీ క్లియర్‌గా తెలుసని చెప్పారు. అలాంటి వ్యక్తి పేదలకు మంచి చేయాలనే ఆలోచనలతో రాజకీయాల్లోకి వస్తే విమర్శలు చేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగి ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. ‘జగన్ ఒక్కటి గుర్తు పెట్టుకో... పవన్ కల్యాణ్ అవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ తలుచుకుంటే నీ తలలో ఒక్క వెంట్రుక కూడా మిగలదు. మొత్తం జుట్టును పీకేస్తారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రౌడీలకు, గుండాలకు అడ్డా అయిందని అసహనం వ్యక్తం చేశారు.

Next Story