- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులు, పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. సీఎంగా చంద్రబాబు తొలి 5 సంతకాలు ఆ ఫైళ్లపైనే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకరించారు. ఈ క్రమంలోనే రేపు (గురువారం) సాయంత్రం 4.41 గంటలకు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే రేపు (గురువారం) సాయంత్రం 4.41 గంటలకు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాబు సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయనున్నట్లు సీఎంవో వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బాబు రెండో సైన్ చేయనున్నారు. మూడో సంతకం పెంఛన్ రూ.4 వేలకు పెంచునున్న ఫైల్‌పై చేయనున్నారు. ఏపీలో అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై బాబు ఐదో సంతకం పెట్టనున్నారు. దీంతో బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ఫైల్‌పై తొలి సంతకం చేస్తారన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.






